లక్నో : బీఎస్పీ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ నకిలీ వీడియోను ప్రమోట్ చేస్తోందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) ఆరోపించారు. మధ్యప్రదేశ్, చత్తీస్ఘఢ్లో పోలింగ్‌కు ముందు కాంగ్రెస్ లక్ష్యంగా మాయావతి విమర్శలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రచారంలో పెట్టిన వీడియో పూర్తిగా అసత్యమని ఈ వీడియోలో తాను బీజేపీ గెలిచినా కాంగ్రెస్ గెలవకూడదని చెప్పినట్టు ఉందని మాయావతి చెప్పారు.
ఫేక్ వీడియోను వైరల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బీఎస్పీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని మాయావతి దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్ఘఢ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఫేక్ వీడియోను సర్క్యూలేట్ చేయడం వారి నైరాశ్యాన్ని వెల్లడిస్తోందని అన్నారు. బీఎస్పీ ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నందునే కాంగ్రెస్ ఈ తరహా కుట్రకు తెగబడిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.
ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మాయావతి ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించి కాంగ్రెస్ పార్టీపై చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఇక మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, చత్తీస్ఘఢ్ మలి దశ పోలింగ్ నవంబర్ 17న జరగనుండగా రాజస్ధాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది.
Read More :
MS Dhoni | ఉత్తరాఖండ్‌లోని పూర్వీకుల ఇంట్లో ధోనీ.. ఫొటోలు వైరల్