లక్నో: బహుజన సమాజ్ వాదీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సోమవారం తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. అతడిని పార్టీ పదవుల నుంచి తొలగించిన మరుసటి రోజే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు ఆకాశ్ ఇచ్చిన సమాధానం స్వార్థం, అహంకారంతో కూడి ఉందని మాయావతి అన్నారు. దీన్ని బట్టి అతడు తన మామ, రాజ్యసభ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ ప్రభావం నుంచి ఇంకా బయట పడనట్టు కనిపిస్తున్నదని తెలిపారు. ఆకాశ్‌కు రాజకీయ పరిపక్వత రాలేదని మాయావతి అభిప్రాయపడ్డారు.