కల్తీ మద్యం తాగి 73 మంది మృతి.. ప్రధాన నిందితుడు అరెస్టు
Bihar Hooch tragedy బీహార్లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 73 మంది మృతిచెందిన కేసులో పోలీసులు కీలక అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ కేసులోని ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని రామ్ బాబు మహతోగా గుర్తించారు. సరన్ జిల్లాలోని డోయిలా అతని స్వగ్రామం. నిందితుడు మహతో ఢిల్లీలో దాచు
న్యూఢిల్లీ: బీహార్లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 73 మంది మృతిచెందిన కేసులో పోలీసులు కీలక అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ కేసులోని ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని రామ్ బాబు మహతోగా గుర్తించారు. సరన్ జిల్లాలోని డోయిలా అతని స్వగ్రామం. నిందితుడు మహతో ఢిల్లీలో దాచుకున్నట్లు తమకు సమాచారం అందిందని క్రైం బ్రాంచ్ కమీషనర్ రవీంద్ర సింగ్ యాదవ్ తెలిపారు.
టెక్నికల్ నిఘా, ఆ తర్వాత నిర్దిష్ట సమాచారం ఆధారంగా మహతోను ద్వారక ప్రాంతంలో పట్టుకున్నట్లు యాదవ్ వెల్లడించారు. నిందితుడు మహతోను అరెస్టు చేసిన విషయాన్ని బీహార్ పోలీసులకు తెలియజేసినట్లు ఢిల్లీ కమీషనర్ తెలిపారు. బీహార్లో మద్య నిషేధం ఉందని, అయితే ఆ అవకాశాన్ని వాడుకుని, త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో నిందితుడు కల్తీ మద్యం అమ్మకాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

