కోస్గి, ఆగస్టు 15 : చేసిన కబ్జాలపై నిలదీస్తుంటే మా పైనే విమర్శలు చేస్తారా? ఖబ డ్దార్ కాంగ్రెస్ నేతల్లా రా అంటూ కోస్గి బీఆర్ఎస్ ఇన్చార్జి వెంకట నర్సిములు కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. హకీంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్నేత న ర్సింహారెడ్డి ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట రైతుల భూములను అన్యాయంగా అ క్రమంగా దోచుకుని మింగుతుంటే ఉన్న వాస్తవాలను ప్రచురిస్తే నమస్తే తెలం గా ణ పత్రికపై పగబట్టిన కాలనాగులా వ్యవహరిస్తూ పైశాచిక ఆనందం పొందుతు న్నారని విమర్శించారు.
తాను చేసిన కబ్జాలపై నిజాలు రాస్తే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడని, ఇలాంటి చెత్త నేతలు ప్రజల్లో ఉంటే ప్రమాదమని అక్కడి గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కోడంగల్ నియోజకవర్గాన్ని తీర్చి దిద్ది అభివృద్ధి పథంలో నడిపిన మాజీ ఎమ్మెల్యేపై పిచ్చి కూతలు కూయడానికి నీ కెంత ధైర్యం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు దమ్ముం టే సీఎం ఇలాకాలో అభివృద్ధి చేసి చూపించాలి త ప్పా ఇలా మతి తప్పిన పనులు చేస్తూ మీడియాపై తమ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
నీలాంటి అవినీ తిపరుల తాట తీయడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉందని త్వరలో నీ అవినీతి బాగోతమంతా బయ టపెడతామన్నారు. న ర్సింహారెడ్డి నీ కుప్పిగంతులు మా ముందు కాదు నీ పార్టీ నేతల ముందు చూపించుకో అని హితవు పలికారు. మ రోసారి నోరు జారి మాజీ ఎమ్మెల్యే పై ఇష్టారీతిన మాట్లా డితే తోలు తీస్తామని హెచ్చరించారు. అనంతరం నమస్తే తెలంగాణ పత్రికపై ఆయన వ్యవహరించి న తీరు, బీఆర్ఎస్ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హకీంపేట కాం గ్రెస్ నేత న ర్సింహారెడ్డిపై విచారణ చేసి అరెస్టు చేసి జైలుకు తరలించాలని పోలీసులకు ఫిర్యాదు అందజేశారు.