స్వాతంత్ర పోరాటంలో మనోళ్లుండడం గర్వకారణం
స్వాతంత్ర పోరాటంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు పాల్గొనడం మనందరికీ గర్వకారణమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. 80వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా కాగజ్‌నగర్‌లో పట్టణంలోని పలు కాలనీల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీ వీరుడు కుమ్రం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీలాంటి మహనీయులు దేశ స్వాతంత్రం కోసం బ్రిటీష్ వారితో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారని స్పష్టం చేశారు.
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
కాగజ్‌నగర్, ఆగస్టు 15 : స్వాతంత్ర పోరాటంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు పాల్గొనడం మనందరికీ గర్వకారణమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. 80వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా కాగజ్‌నగర్‌లో పట్టణంలోని పలు కాలనీల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీ వీరుడు కుమ్రం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీలాంటి మహనీయులు దేశ స్వాతంత్రం కోసం బ్రిటీష్ వారితో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారని స్పష్టం చేశారు.
మనం ఈ దేశంలో పుట్టడం గర్వకారణమని, ఇప్పటికీ అనేక దేశాల్లో చదువుకునే హకు కూడా లేదని, అమ్మాయిలు పుస్తకాలు పట్టుకుంటే నేరంగా చూస్తున్నారన్నారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి, ఝౌన్సీ రాణి, గాంధీ, అంబేడర్ వంటి మహనీయులు మనకు స్వాతంత్రాన్ని సాధించి పెట్టారని స్పష్టం చేశారు. స్వేచ్ఛ అంటే మొబైల్ వాడడం, గంజాయి సేవించడం, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, పాఠశాలలకు ఆలస్యంగా రావడం, చీటింగ్ చేయడం, పరీక్షల్లో కాపీ కొట్టడం కాదన్నారు.
పుస్తకాలు చదవాలి, మహనీయుల జీవితాల నుంచి గొప్ప విషయాలు నేర్చుకోవాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను గౌరవించడం అలవర్చుకోవాలన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో నా మొట్టమొదటి ఓటు ఈ ఫాతిమా హైసూల్లోనే వేశానన్నారు. మొబైల్ ఫోన్ క్రియేటివిటీని, జీవితాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు. ఇతరులపై ఆధారపడకుండా సొంత శక్తితో ఎదగాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్టణంలోని పలు వార్డులోఎ్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, అభిమానులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

