నస్పూర్/ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 15 : ఊరూరా స్వాతం త్ర దినోత్సవ వేడుకలు కనుల పండువగా సాగాయి. శనివారం ఉదయం జయజయ నినాదాల నడుమ మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. మంచిర్యాలలోని నస్పూర్ కలెక్టరేట్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, ఆసిఫాబాద్‌లోని కలెక్టరేట్, పరేడ్ గ్రౌండ్లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం వారు ప్రభుత్వ కార్యక్రమాల ప్రగతి సందేశాలను చదివి వినిపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. జిల్లాలను అభివృద్ధిలో ముందుంచేందుకు అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆయాచోట్ల మంచిర్యా ల, ఆసిఫాబాద్ కలెక్టర్లు కుమార్ దీపక్, హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎస్పీ నితికాపంత్, అదన పు కలెక్టర్లు డేవిడ్, యువరాజ్ మర్మాట్, చంద్రయ్య, రా ములు, సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
సమాజాభివృద్ధికి కృషి చేయాలి
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 15 : పోలీసులు శాంతి భద్రతల పరిరక్షించడంతో పాటు సమాజాభివృద్ధికి కృషి చేయాలని రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝా కోరారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన జాతీయ జెండాను ఆవిషరించారు. గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
హామీల అమలులో సర్కారు విఫలం
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్ టౌన్,ఆగస్టు15 : కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. శనివారం ఆసిఫాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయం,బీఆర్ఎస్ భవన్లో పార్టీ సీనియర్ నాయకురాలు సరస్వతీ, మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్, ప్రజా ప్రతినిధు లు,నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిషరించి వందనం చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, ప్రగతి పథంలో నడిపించి దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.