AC unit | ఈ ఏడాది సమ్మర్లో అగ్నిప్రమాద ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, పార్కింగ్ స్థలాలు ఇలా ఒకటేంటి ఎటు చూసినా అగ్నిప్రమాదాలే. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఓ హౌసింగ్ సొసైటీ (housing society)లో భారీ అగ్నిప్రమాదం (Massive fire) సంభవించింది.
ఘజియాబాద్ (Ghaziabad)లోని వసుంధరలోగల సెక్టార్ 1లో ఉన్న రెసిడెన్షియల్ సొసైటీలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. సొసైటీలోని మొదటి అంతస్తులో ఉన్న ఇంట్లో ఎయిర్ కిండిషనింగ్ యూనిట్ (AC unit )లో మంటలు చెలరేగాయి. ‘ఈరోజు ఉదయం 5:30 గంటలకు ఘజియాబాద్ సెక్టార్ 1 వసుంధర ప్రాంతంలోని రెసిడెన్షియల్ సొసైటీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంటి నంబర్ – 1009లోని ఏసీ యూనిట్లో మంటలు చెలరేగినట్లు వైశాలిలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందింది. రెండు అగ్నిమాపక యంత్రాలు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి’ అని చీప్ ఫైర్ ఆఫీసర్ రాహుల్ పాల్ తెలిపారు.
ముందుగా ఏసీ యూనిట్ నుంచి పేలుడు సంభవించిందని, ఆ తర్వాత మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. మొదటి అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకోగా.. మంటలు రెండో అంతస్తు వరకూ చేరినట్లు పేర్కొన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న విషయం తెలిసిందే. సాధారణం కంటే అధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతకు తట్టుకోలేక ప్రజలు నిరంతరంగా ఏసీని ఉపయోగిస్తున్నారు. దీంతో అవి పేలి మంటలు చెలరేగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
#WATCH | Rahul Kumar, Chief Fire Officer says, ” Today around 5:30 am, Vaishali Fire station received information that a fire broke out at a 2-storey building in Vasundhara. 2 fire tenders were rushed to the spot…the fire broke out because the AC unit exploded. Fire was doused… pic.twitter.com/pZjWIE5vcF
— ANI (@ANI) June 6, 2024
Also Read..
Hyderabad | ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క