Massive fire | దేశ రాజధాని ఢిల్లీలో వరుస ఆగ్నిప్రమాదాలు (Massive fire) ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవాళ ఉదయం ద్వారకా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తండ్రి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఢిల్లీలోని మరో ప్రాంతంలోనూ ప్రమాదం చోటు చేసుకుంది. మంగోల్పురి ఇండస్ట్రియల్ ప్రాంతం (Mangolpuri Industrial area)లోని రబ్బర్ ఫ్యాక్టరీ (rubber factory)లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని 12 ఫైర్ఇంజన్లతో మంటలను అదుపు చేశారు.
ఇవాళ ఉదయం 9:58 గంటల ప్రాంతంలో ద్వారకా సెక్టార్-13 లోని శపథ సొసైటీలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అపార్ట్మెంట్లోని ఎనిమిది, తొమ్మిది అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన నివాసితులు ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి కిందకు దూకేశారు. అలా ప్రాణాలను కాపాడుకునే క్రమంలో తండ్రి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
ముందుగా పదేళ్ల ఇద్దరు చిన్నారులు ప్రమాదం నుంచి బయటపడేందుకు బాల్కనీ నుంచి కిందుకు దూకేశారు. పిల్లల తండ్రి 35 ఏళ్ల యష్ యాదవ్ కూడా కిందకు దూకాడు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా.. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
Also Read..
IMD | రానున్న మూడు రోజులు తీవ్ర వేడి గాలులు.. ఢిల్లీకి ఐఎండీ రెడ్ అలర్ట్
Earthquakes | భారత్-మయన్మార్ సరిహద్దుల్లో వరుస భూకంపాలు.. 36 గంటల్లో ఏకంగా..
Massive Fire | ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి దూకి తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి