Fire Accident | తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. అరియలూరు జిల్లాలోని ఓ
బాణాసంచా యూనిట్లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు
కోల్పోయారు. మృతుల కుటుంబాలకు సీఎం ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు, ప్రమాదంలో గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని విరగలూరు గ్రామంలోని ఓ ప్రైవేటు యూనిట్లో ఈ ఘటన జరగ్గా.. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురిని తంజావూరు మెడికల్ కాలేజీలో చేర్పించినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.