యమునోత్రి, మే 11: చార్ధామ్ యాత్రలో భాగంగా శనివారం కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చలికాలంలో మూసివేసిన ఈ దేవాలయాలను శుక్రవారం నుంచి తెరచిన సంగతి తెలిసిందే.
భక్తుల తాకిడి పెరగడంతో దర్శనాల కోసం చాలాసేపు క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. ఇరుకు దారుల్లో దాదాపు రెండు గంటలపాటు నిల్చోవాల్సి వస్తోందని భక్తులు తెలిపారు.