న్యూఢిల్లీ: ముఖానికి ముసుగులు ఉన్న కొందరు వ్యక్తులు పెట్రోల్ బంక్ సిబ్బందిని గన్‌తో బెదిరించి డబ్బులు దోచుకున్నారు. (Masked Men Attack and Loot) ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం అర్ధరాత్రి వేళ ముండ్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘేవ్రా ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు ఆరుగురు వ్యక్తులు మూడు బైకులపై వచ్చారు. ఒక బైక్‌లో పెట్రోల్ పోయించుకున్న తర్వాత బైక్‌పై ఉన్న వ్యక్తి బ్యాగు నుంచి మరో వ్యక్తి గన్ బయటకు తీశాడు. అది చూపించి పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించాడు. తొలుత అతడు పట్టించుకోకపోవడంతో గన్‌తో అతడి తలపై కొట్టాడు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన ఆ వ్యక్తిని మరో దుండగుడు కూడా గన్‌తో బెదిరించాడు. అతడిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. గాయపడిన ఆ వ్యక్తి నుంచి సుమారు రూ.12,000 దోచుకున్నారు. ఆ తర్వాత బైక్‌లపై అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, ఈ దోపిడీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన పట్ల స్థానికులు భయాందోళన చెందారు.
Caught On Cam: Masked Men Attack, Loot Delhi Petrol Pump Staff At Gunpoint https://t.co/Jf6RwUrqV5#viralvideo #TrendingNews #LOOT #DelhiCrime pic.twitter.com/p1o07V8HGu
— Joy Pillai (@TheJoyPillai) October 12, 2023