న్యూఢిల్లీ, జూన్ 6: పలు బ్యాంకుల వద్ద వేలాది కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీకి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన అన్ని రకాల బ్యాంక్ ఖాతాలతోపాటు షేర్లు, మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన ఖాతాలను జప్తు చేసింది. దీంతో ఈ ఖాతాల్లో ఉన్న రూ.2.1 కోట్లను రికవరి చేసింది.
జరిమానా విధింపుపై విఫలమైతే ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను జప్తు చేయనున్నట్లు గత నెల 15న జారీ చేసిన డిమాండ్ నోటీసుకు అనుగుణంగా సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్ద రూ.14 వేల కోట్లకు పైగా రుణాలను తీసుకొని ఎగ్గొట్టారు.