ముంబై, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. సంఘటనా స్థలం నుండి పోలీసులు మూడు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, గడ్చిరోలి, నారాయణపూర్ జిల్లా సరిహద్దు సమీపంలో నక్సలైట్లు దాకున్నట్లు సమాచారం అందింది. 8 గంటల పాటు ఇరుపక్షాల మద్య కొనసాగిన కాల్పుల్లో ముగ్గురు మహిళా, ఒక పురుష నక్సలైట్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన నక్సలైట్స్ గట్టా దళం కంపెనీ నెంబర్ 10, ఇతర మావోయిస్టు సంస్థలకు చెందినవారు.