Chhattisgarh | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మళ్లీ తుపాకులు గర్జించాయి. బుల్లెట్ల వర్షం కురిసింది. మావోయిస్టు కీలక నేత హిడ్మా లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. నేషనల్ పార్కు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు సమాచారం.