కొత్తగూడెం ప్రగతి మైదాన్: ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన వ్యక్తి మావోయిస్టు బెటాలియన్ స్నైపర్ సోధీ కన్నా అని వెల్లడైంది. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర సోమవారం మాట్లాడుతూ.. సోధీ మావోయిస్టు హిద్మా కనుసన్నల్లో పని చేసే (స్నైపర్) 1వ బెటాలియన్, 2వ కంపెనీ డిప్యూటీ కమాండర్ అని తెలిపారు.
సోధీపై రూ.8 లక్షల రివార్డు ఉన్నదని, ఇతడు టేకల్ గుడియం, ధర్మారం దాడుల్లో పాల్గొన్నాడని తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పలు పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.