న్యూఢిల్లీ: పలువురు కేంద్ర మంత్రులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. హోం, విదేశాంగ, ఆరోగ్య, ఐటీ శాఖల మంత్రులు అమిత్ షా, జైశంకర్, నడ్డా, అశ్విని వైష్ణవ్ సహా ఇతర మంత్రులు పూజా కార్యాక్రమాల అనంతరం ఆయా మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో ఆసీనులయ్యారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం జైశంకర్ మాట్లాడుతూ ‘భారత్ ఫస్ట్, వసుదైక కుటుంబం’ అనేవి దేశ విదేశాంగ విధానానికి మార్గదర్శక సూత్రాలుగా ఉంటాయని అన్నారు. పార్లమెంట్ సజావుగా నడిచేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా పనిచేస్తానని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి బాధ్యతల స్వీకరణ అనంతరం అన్నారు.