Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ వారసుడిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటన హాట్ డిబేట్‌కు వేదికైంది. ప్రధాని మోదీకి త్వరలో 75 ఏండ్లు వస్తాయని, బీజేపీలో 75 ఏండ్లుపైబడిన వారిని పదవుల నుంచి పక్కకుపెట్టే విధానం ఉందని, మరి తదుపరి ప్రధాని ఎవరని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ నేతలు స్పందిస్తున్నారు.
కేజ్రీవాల్‌కు మతి తప్పిందని, ప్రధాని ఎవరనేది తమ పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయమని హరియాణ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. దేశ ప్రధానిగా ఓ వ్యక్తి ఎన్నేండ్లు పదవిలో ఉండాలనే దానిపై రాజ్యాంగంలో ఎలాంటి వయో పరిమితి లేదని చెప్పారు.
మీరు అమిత్ షాను ఈ విషయం అడిగితే ఎవరు ప్రధాన మంత్రి అవుతారనే వివరాలను ఆయన వెల్లడిస్తారని ఖట్టర్ వ్యాఖ్యానించారు. కర్నాల్‌లో ఖట్టర్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక హరియాణలోని అన్ని లోక్‌సభ స్ధానాలను ఎన్డీయే గెలుచుకుంటుందని ఖట్టర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More :
Arvind Kejriwal | ఆప్ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ భేటీ.. కీలక ఎమ్మెల్యే మిస్సింగ్