Kejriwal | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) అమాయకుడు అని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పేర్కొన్నారు. లిక్కర్‌స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాను ఆదివారం ఎనిమిది గంటలు ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ట్విట్టర్ వేదికగా స్పందించారు. మనీశ్ సిసోడియా (Manish Sisodia)ను అరెస్ట్ చేయడం ద్వారా కేంద్రం మురికి రాజకీయాలు చేస్తున్నదని మండి పడ్డారు.
मनीष बेक़सूर हैं। उनकी गिरफ़्तारी गंदी राजनीति है। मनीष की गिरफ़्तारी से लोगों में बहुत रोष है। लोग सब देख रहे हैं। लोगों को सब समझ आ रहा है। लोग इसका जवाब देंगे।
इस से हमारे हौसले और बढ़ेंगे। हमारा संघर्ष और मज़बूत होगा।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 26, 2023
`ఆయన అరెస్ట్‌తో మురికి రాజకీయాలు చేస్తున్నారు. మనీశ్ సిసోడియా (Manish Sisodia) ను అరెస్ట్ చేయడంతో ప్రజల్లో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఏం జరుగుతుందన్న విషయాన్ని గమనిస్తున్నారు. ప్రజలు ప్రతి అంశాన్నిఅర్థం చేసుకుంటున్నారు. ప్రజలు దీనికి ప్రతిస్పందిస్తారు. ప్రజల స్పందనే మాకు మరింత స్ఫూర్తినిస్తుంది. మా పోరాటం మరింత బలోపేతం అవుతుంది` అని అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు.
VIDEO| "Manish Sisodia was arrested in a false case," says AAP leader Sanjay Singh on Delhi Deputy CM's arrest by CBI today. pic.twitter.com/MweX1WiGAG
— Press Trust of India (@PTI_News) February 26, 2023
మనీశ్ సిసోడియా (Manish Sisodia) ను తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. సిసోడియా అరెస్ట్‌కు, ఏ విచారణతో సంబంధం లేదని ఆప్ నేత అతిషి పేర్కొన్నారు. `ఏడాది కాలంగా ఆయన ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు బీజేపీ ఎటువంటి ఆధారాలు చూపలేకపోయింది. ఆయన అరెస్ట్‌కు, ఏ కేసు విచారణకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ కేసు కోర్టు ముందుకెళుతుందని, సిసోడియా ఒక్కరూపాయికి అవినీతికి పాల్పడినట్లు బీజేపీ రుజువు చేయలేదన్నారు.