ఇంఫాల్: మణిపూర్లో మళ్లీ హింస రేగింది. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో అనుమానిత కుకీ తీవ్రవాదులు ఆదివారం జరిపిన డ్రోన్, తుపాకీ, బాంబు దాడుల్లో ఓ మహిళ సహా ఇద్దరు మరణించారు. గాయపడిన తొమ్మిది మందిని దవాఖానకు తరలించారు.
తీవ్రవాదులు కొండలపై నుంచి లోయలోకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో గ్రామస్థులంతా సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారని పేర్కొన్నారు.