Manipur | మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామాపై హైడ్రామా.. సోషల్‌మీడియాలో చించేసిన లేఖ వైరల్
Manipur | మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామాపై శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బీరెన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని ఉదయం నుంచి ప్రచారం జరిగింది.
Manipur | మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామాపై శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బీరెన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని ఉదయం నుంచి ప్రచారం జరిగింది. కానీ రాజీనామా నిర్ణయంపై బీరెన్ సింగ్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా సీఎం పదవికి రాజీనామా చేయబోవడం లేదని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
At this crucial juncture, I wish to clarify that I will not be resigning from the post of Chief Minister.
— N.Biren Singh (@NBirenSingh) June 30, 2023
సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేస్తారని ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. దీంతో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఇంఫాల్‌లోని సీఎం నివాసానికి చేరుకున్నారు. తన నిర్ణయం మార్చుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తన నివాసం నుంచి కాన్వాయ్‌లో బయటకు వచ్చిన బీరెన్ సింగ్‌ను మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆయన తిరిగి నివాసం లోపలికి వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తాను రాజీనామా చేయబోవడం లేదని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే చించేసిన రాజీనామా లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన నిర్ణయాన్ని మార్చుకోవాలని రిక్వెస్ట్ చేసిన మహిళా మద్దతుదారులే బీరెన్ సింగ్ చేతుల్లో నుంచి రాజీనామా లేఖను తీసుకుని చించేసినట్లు తెలుస్తోంది.

మైతేయ్, కుకీల మధ్య రిజర్వేషన్ల విషయంలో ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. మే 3వ తేదీన జరిగిన గిరిజన సంఘీభావ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 50 రోజులుగా జరుగుతున్న ఈ అల్లర్లలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినా ఇంకా ఈ గొడవలు సద్దుమణగలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

