RSS : కుల వ్యవస్ధ సోపాన క్రమం కొనసాగాలని ఆరెస్సెస్ కోరుకుంటుందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు. అగ్ర కులాల వారు ముందువరసలో ఓబీసీలు, ఎస్సీలు దిగువ స్ధాయిలో ఉండే వ్యవస్ధను ఆరెస్సెస్ అనుసరిస్తుందని చెప్పారు. పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఇదే తీరులో మాట్లాడారని పేర్కొన్నారు.
కుల వ్యవస్ధ కొనసాగాలన్నదే కాషాయ పాలకుల విధానమని స్పష్టం చేశారు. న్యాయపరమైన ప్రక్రియతో కుల వ్యవస్ధను పెకిలించివేయాలని ఆకాంక్షించే క్రమంలోనే తాము కుల గణనను కోరుతున్నామని చెప్పారు. అప్పుడే నిజమైన వివక్షను పరిష్కరించడం సాధ్యమవుతుందని అన్నారు. రిజర్వేషన్, రాజ్యాంగం, కుల నిర్మూలనకు ఆరెస్సెస్ వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు.
కుల వ్యవస్ధ వేళ్లూనుకునేందుకు రాజ్యాంగంలో మార్పులను ఆరెస్సెస్ కోరుకుంటున్నదని అన్నారు. భారత్ ఏకమత రాజ్యంగా ఉండాలని ఆరెస్సెస్ ఆకాంక్ష అని చెప్పారు. ఈ రకమైన ఆరెస్సెస్ ఆలోచనా ధోరణి మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ల ఆశయాలకు విరుద్ధమని మాణిక్యం ఠాగూర్ వివరించారు. ఆరెస్సెస్ విధానాలను కాషాయ పాలకులు అనుసరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Read More :
Technology | ఫోన్లు, ఫ్యాన్లే కాదు.. స్విచ్‌లు కూడా స్మార్ట్‌గా..