Technology | ఈ సాంకేతిక యుగంలో ఫోన్లు, ఫ్యాన్లే కాదు.. స్విచ్‌లు కూడా స్మార్ట్‌గా తయారవుతున్నాయి. ఆన్/ ఆఫ్ బటన్లు.. టచ్‌స్క్రీన్‌పై వాలిపోతున్నాయి. భారత్‌కు చెందిన ప్రముఖ హోమ్ ఆటోమేషన్ బ్రాండ్ ‘స్మార్ట్ నోడ్’.. స్మార్ట్ స్విచ్‌బోర్డులను మార్కెట్లో విడుదల చేసింది. లగ్జరియస్ డిజైన్‌తో తయారైన ఈ స్విచ్‌బోర్డులు.. ఏ ఇంటీరియర్లోనైనా అందంగా ఒదిగిపోతాయి. ఇవి బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతాయి. దాంతో ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కడినుంచైనా ఆన్/ ఆఫ్ చేయవచ్చు. లైట్, ఫ్యాన్‌ను ఆన్ చేయడమే కాదు.. లైటింగ్, ఫ్యాన్ స్పీడ్‌ను కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇందులోని మరో ఫీచర్.. చైల్డ్ లాక్, గెస్ట్ లాక్. పెద్దల పర్మిషన్ లేకుండా ఏసీలు, టీవీలు ఆన్/ ఆఫ్ చేయడానికి అవకాశమివ్వదు. ఈ స్మార్ట్ స్విచ్‌బోర్డ్ రిమోట్‌తోపాటు అలెక్సా, గూగుల్ హోమ్ ద్వారా వాయిస్‌తోనూ పనిచేస్తుంది. ‘స్మార్ట్నోడ్’ యాప్ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కు లైవ్ నోటిఫికేషన్స్ పంపిస్తుంది. ఇంట్లో గృహోపకరణాల స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది. రూ. 15,000లకు లభించే ఈ స్మార్ట్ స్విచ్‌బోర్డులను smartnode.in/ products లో కొనుగోలు చేయవచ్చు.
క్రీడలతోపాటు ట్రెక్కింగ్, రాక్ ైక్లెంబింగ్లాంటి సాహసాలు చేసేవారి కోసం మరో స్మార్ట్‌వాచీ మార్కెట్లోకి వచ్చింది. లగ్జరీ స్మార్ట్‌వాచీల తయారీ సంస్థ కొరోస్.. ‘కొరోస్ వెర్టిక్స్ 2’ పేరుతో అడ్వెంచర్ సిరీస్ వాచీని తయారుచేసింది. ఈ స్మార్ట్‌వాచ్ శాటిలైట్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీఎన్ఎస్ఎస్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. 39 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. టైటానియమ్తో తయారైన బేజిల్, 1.4 అంగుళాల టచ్‌స్క్రీన్.. ఈ వాచీ ప్రత్యేక ఆకర్షణలు. 10 ఏటీఎం వాటర్ రెసిస్టెంట్‌తో..
వాటర్ యాక్టివిటీస్‌కు అనుగుణంగా ఉంటుంది. ఇన్‌బిల్ట్ గ్లోబల్ ఆఫ్‌లైన్ మ్యాప్స్ ఉండటం వల్ల జీపీఎస్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లోనూ మ్యాప్స్‌ను అందుబాటులో ఉంచుతుంది. హార్ట్‌రేట్ మానిటర్, స్టెప్ కౌంట్, ఆల్టిమీటర్, గైరోస్కోప్, 3డీ కంపాస్, థర్మామీటర్గానూ పనిచేస్తుంది. ఇందులోని మరో అద్భుతమైన ఫీచర్.. 32జీబీ ఆన్‌బోర్డ్ మెమరీతో ఈ వాచీ వస్తున్నది. ఇష్టమైన పాటలు, ఫొటోలు, ఇతర సమాచారాన్ని స్టోర్ చేసుకోవచ్చు. దీనిని ఇన్‌స్టా 360 కెమెరాకు రిమోట్గానూ వాడుకోవచ్చు. రెండేళ్ల వారంటీతో వస్తున్న ‘కొరోస్ వెర్టిక్స్ 2’ ఖరీదు.. రూ. 63,000. coros.comద్వారా ఆర్డర్ ఇవ్వొచ్చు.
ఈ కాలపు కుర్రాళ్లు మెచ్చిన ఫుట్‌వేర్ ఫ్యాషన్.. క్లాగ్స్! రబ్బరును పోలివుండే ఈవీఏ (ఎలాస్టోమెరిక్ పాలిమర్)తో తయారైన ఈ పాదరక్షలే ఇప్పుడంతా ట్రెండ్! ఈ తరహా ఫుట్‌వేర్ వర్షాకాలపు సీజన్‌కు ఎంతో అనుకూలంగా ఉంటాయి. నీళ్లలో ఎంత తడిసినా.. క్షణాల్లోనే ఆరిపోతాయి. ఒక్కచుక్క నీటిని కూడా పీల్చుకోవు. అయితే, నిన్నమొన్నటి దాకా చెప్పులు, క్రాక్స్ మోడల్స్‌లోనే కనిపించాయి. ఇప్పుడు ‘షూ’లను పోలిన క్లాగ్స్ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రఖ్యాత పారగాన్ సంస్థ కూడా.. సరికొత్త క్లాగ్స్‌ను తయారుచేసింది. తక్కువ బరువుతో వాకింగ్, జాగింగ్కూ అనుకూలంగా ఉండేలా వీటిని రూపొందించింది. ఈ సరికొత్త బూట్లు సౌకర్యంతోపాటు స్టయిలిష్‌గానూ ఉంటాయి. యాంటీ స్కిడ్ టెక్నాలజీతో తయారైన ఈ క్లాగ్స్ ధర.. రూ. 839. paragonfootwear.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.
వానకాలం ముసురు.. చల్లగాలినీ తోడు తెచ్చుకుంటుంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పడిపోయి.. శీతకాలాన్ని తలపిస్తుంది. ఇలాంటి వాతావరణంలో రూమ్ హీటర్లాంటి ఓ నేస్తం తోడుగా ఉంటే.. వర్షాకాలపు సాయంత్రాలను మరింత వెచ్చగా ఆస్వాదించవచ్చు. జర్మనీకి చెందిన బ్లమ్ఫెల్ట్ సంస్థ తయారుచేసిన ‘ప్రైమల్ హీట్ 65’ అలాంటి వెచ్చని నేస్తమే! ఇన్డోర్తోపాటు ఔట్‌డోర్‌లోనూ వాడుకునేలా ఈ హీటింగ్ టేబుల్ రూపొందింది. ఇందులోని 1200 వాట్ కార్బన్ ఇన్ఫ్రారెడ్ హీటింగ్ ట్యూబ్.. 24 చదరపు అడుగుల వరకూ వేడిగాలిని అందిస్తుంది. దీనికున్న ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు.. ఈ పరికరానికి 60 సెంటీమీటర్లలోపు ఎవరైనా వస్తే వెంటనే గుర్తిస్తాయి. దాంతో మెషిన్ ఆటోమేటిగ్గా యాక్టివేట్ అవుతుంది. సమీపంలో ఎవరూ లేకపోతే వెంటనే ఆఫ్ అయిపోతుంది. అలా విద్యుత్‌ను ఆదా చేస్తుంది. కాఫీ టేబుల్‌గానూ ఉపయోగపడే ‘ప్రైమల్ హీట్ 65’ ధర.. రూ. 17,500. blumfeldt.co.ukలో లభిస్తుంది.