న్యూఢిల్లీ, మార్చి 5: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఆయన సన్నిహిత సహచరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువులో రెండుసార్లు విఫలమైన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో తనతో కలిసి చదువుకున్నప్పుడు రాజీవ్ గాంధీ ఫెయిలయ్యారని, ఆ తర్వాత ఆయన లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి వెళ్లి అక్కడ కూడా విఫలమయ్యారని తెలిపారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదివినవారు ఫెయిలవడం చాలా అరుదని, తమ విద్యార్థులందరినీ కనీసం పాస్ చేసేందుకైనా ఆ యూనివర్సిటీ ప్రయత్నిస్తుందని, అయినప్పటికీ రాజీవ్ గాంధీ ఫెయిలయ్యారని వివరించారు. సోనియా గాంధీని కలిసేందుకు గత పదేండ్లలో ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ లభించలేదని, రాహుల్‌తో ఒక్కసారే మాట్లాడానన్నారు.