న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలని సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేత పోషించే పాత్ర ఎల్లప్పుడూ విస్తృతంగా ఉండాలని చెప్పారు. అది ఒకే ఒకటిగా ఉండకూడదని, ఇండియా కూటమిలో ప్రధానమైనదిగా ఉండాలని తెలిపారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఇతర పార్టీ ఇండియా కూటమికి నాయకత్వం వహించగలదా? అని ప్రశ్నించినపుడు అయ్యర్ స్పందిస్తూ.. కూటమి నాయకత్వాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలని చెప్పారు. కూటమిలో భాగస్వాములుగా ఉన్న మమతా బెనర్జీ, ఇతర నేతలకు సారథ్యం వహించే సామర్థ్యం ఉంది అని పేర్కొన్నారు.