Viral Video : భారత్‌లో మ్యాంగో జ్యూస్‌ను దశాబ్దాలుగా చిన్నా పెద్దా అంతా ఇష్టంగా తీసుకుంటారు. ఆకట్టుకునే ట్యాగ్‌లైన్స్‌తో, సెలబ్రిటీల ఎండార్స్మెంట్లతో ఈ జ్యూస్ ఎక్కడ చూసినా నోరూరిస్తుంటుంది. అయితే ఈ జ్యూస్‌ల్లో సహజమైన మామిడి అసలు ఉండదంటే నమ్మలేరు. కానీ ఇటీవల ఓ కంటెంట్ క్రియేటర్ జ్యూస్ ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి చేసిన వీడియో షాకింగ్ వివరాలను వెల్లడించింది.
పసుపు రంగులో ఉండే ద్రవ పదార్ధాన్ని రెడ్, ఆరంజ్ ఫుడ్ కలర్లో కలిపి, మెషీన్లో షుగర్ సిరప్, ఇతర కెమికల్స్‌ను మిక్స్ చేసిన తీరు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ ఇన్‌స్టా వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. ఆపై ప్రాసెస్డ్ లిక్విడ్‌ను ప్లాస్టిక్ పేపర్ ప్యాకెట్స్‌తో కూడిన బాటిల్స్‌లో నింపడం కనిపిస్తుంది. ఇక పలువురు వర్కర్ల సాయంతో వీటిని భారీ కార్టన్స్‌లో ప్యాక్ చేసి విక్రయదారులకు పంపడం చూడొచ్చు.
టెట్రా ప్యాక్ మ్యాంగో జ్యూస్ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. వీడియోను పోస్ట్ చేసిన వెంటనే పలువురు యూజర్లు దీనిపై పెదవివిరిచారు. ఈ వీడియో చూసిన తర్వాత మ్యాంగో జ్యూస్‌ను తాను ముట్టేదిలేదని ఓ యూజర్ కామెంట్ చేశారు. మ్యాంగో పల్ప్ ఎక్కడ అంటూ మరో యూజర్ ప్రశ్నించారు. మ్యాంగో మినహా ప్రతి ఒక్కటీ అందులో ఉందని మరో యూజర్ కామెంట్ చేశారు. స్లో పాయిజన్, దీని వెనుక ప్రభుత్వ సపోర్ట్ ఉందని మరో యూజర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Read More :
Jasprit Bumrah | ‘ఎవరికి బౌలింగ్ చేయడం కష్టం?’.. బుమ్రా జావాబిదే..!