కరోనా సెకండ్ వేవ్‌తో దేశం అతలాకుతలమవుతోంది. వైరస్ బారినపడకుండా ఉండాలంటే
ఇంట్లోనే ఉండటం సురక్షితమని, ఒక వేళ బయటకు వస్తే డబుల్ మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సర్జికల్ మాస్క్, ఎన్95 మాస్క్, క్లాత్ మాస్క్ ఇలా రకరకాల మాస్క్‌లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చేశాయి. తాజాగా ఓ సాధువు.. ప్రకృతిసిద్ధమైన మాస్క్ తయారు చేసుకుని ధరిస్తున్నాడు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి కావడంతో ఓ సాధువు వినూత్నంగా ఆలోచించి వెరైటీ మాస్క్ రూపొందించారు.
ప్రకృతిసిద్ధమైన మాస్క్ తయారు చేసుకొని ముఖానికి పెట్టుకున్నారు. వేప, తులసి ఆకులతో ముక్కు, నోటి భాగం కవరయ్యేలా దీన్ని ధరించడం విశేషం. సాధువు ప్రకృతి మాస్క్ ధరించిన వీడియోను ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ట్విటర్లో షేర్ చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలోని ఓ బస్‌స్టాండ్‌లో బాబా ఇలా కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Not sure this #MASK WILL HELP.
— Rupin Sharma (@rupin1992) May 22, 2021
जुगाड़☺️☺️
Still #मजबूरी_का_नाम_महात्मा_गांधी#NECESSITY_is_the_mother_of_JUGAAD #Mask And Medicine😂🤣😷😷😷 pic.twitter.com/uHcHPIBy9D