Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆయనపై దాడికి యత్నించగా.. ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో కేజ్రీవాల్‌పై బాటిల్లోని లిక్విడ్‌ను పోసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించారు. దాంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అడ్డుకున్నారు. పాదయాత్రలో అరవింద్ కేజ్రీవాల్ మద్దతుదారుల మధ్య నడుచుకుంటూ వస్తున్నారు. ఒక్కసారిగా గుంపులో నుంచి వచ్చిన వ్యక్తి బాటిల్‌ను తీసి.. అందులో ఉన్న ఉన్న ద్రవాన్ని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిపై పోసేందుకు ప్రయత్నించాడు.
కేజ్రీవాల్‌తో పాటు అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. అయితే, సీసాలో కేవలం నీరు మాత్రమే ఉందని.. ప్రమాదకరమైన లిక్విడ్స్ ఏమీ లేవని తెలుస్తున్నది. సదరు వ్యక్తిని అశోక్ ఝాగా గుర్తించారు. అలా చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే, గతంలోనూ కేజ్రీవాల్‌పై ఇదే తరహాలోనూ ఇంక్ పోసిన సందర్భాలు ఉన్నాయి. కేజ్రీవాల్‌పై లిక్విడ్ పోసిన వ్యక్తిని కేజ్రీవాల్ మద్దతుదారులు పట్టుకొని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆప్ నేత సౌరభ్ భరద్వాస్ ఆరోపించారు. ఢిల్లీలో శాంతిభద్రతలు కుప్పకూలాయని.. కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి ఏం చేయడం లేదంటూ విమర్శించారు.
VIDEO | Security personnel overpowered a man who apparently tried to attack AAP national convener Arvind Kejriwal during padyatra in Delhi’s Greater Kailash area. More details are awaited. pic.twitter.com/aYydNCXYHM
— Press Trust of India (@PTI_News) November 30, 2024