ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరఫున ఆడుతున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ.. ఆ టీమ్ జెర్సీ వేసుకోలేనని చెప్పాడు. ఆ జెర్సీపై ఆల్కహాల్ బ్రాండ్ లోగో ఉండటమే దీనికి కారణం. మొయిన్ అలీ ఓ ముస్లిం. ఆల్కహాల్ తీసుకోవడం, వాటిని ప్రోత్సహించడం ఇస్లాం మత ఆచారాలకు విరుద్ధం. దీంతో మొయిల్ అలీ ఇంగ్లండ్ టీమ్‌కే కాదు ఏ దేశవాళీ టీమ్‌కు ఆడినా కూడా ఆల్కహాల్ బ్రాండ్ జెర్సీలు ధరించడు.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ జెర్సీపై ఎస్ఎన్జే 10000 బ్రాండ్ లోగో ఉంది. ఇది చెన్నైలో ఉన్న ఎస్ఎన్జే డిస్టిలరీస్‌కు చెందినది. ఈ లోగోను తొలగించాలని మొయిన్ అలీ కోరగా అందుకు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అంగీకరించింది. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మొయిన్ అలీని ఏకంగా రూ.7 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గత మూడు సీజన్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన మొయిన్ అలీ.. తొలిసారి చెన్నైకి ఆడుతున్నాడు.
ఇవికూడా చదవండి..
వన్డేల్లో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కొత్త వరల్డ్ రికార్డ్
మీరు క్రికెట్ ఎక్స్‌పర్టా? ఇది అవుటా.. కాదా చెప్పండి.. వీడియో
సినిమా టైటిల్ చెప్పని డైరెక్టర్.. ఎత్తి కుదేసిన నటుడు.. వీడియో
మమతా బెనర్జీ తప్పుడు ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాషింగ్టన్ సుందర్ కుక్క పేరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా