ముంబై: స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు గాయపడ్డాడు. పరిహారం కోసం కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆ వ్యక్తికి రూ.31 లక్షలకుపైగా పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. (Compensation) మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. 2019 మార్చి 31న చిరు వ్యాపారి అయిన 38 ఏళ్ల గోపీచంద్ శంకర్ పాటిల్ స్కూటర్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇండియన్ పీనల్ కోడ్, మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం ర్యాష్ డ్రైవింగ్, ఇతర నేర సెక్షన్ల కింద కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, ఏడాదికి 5 లక్షల వార్షిక ఆదాయం పొందే తాను ఈ రోడ్డు ప్రమాదం కారణంగా 40 శాతం వైకల్యం పొందినట్లు గోపీచంద్ శంకర్ పాటిల్ పేర్కొన్నాడు. పరిహారం కోసం మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు.
మరోవైపు ఐదేళ్ల పాటు విచారణ జరిపిన ఆ ట్రిబ్యునల్ నవంబర్ 12న తీర్పు ఇచ్చింది. పాటిల్‌కు పరిహారంగా రూ.31.39 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. భవిష్యత్తు ఆదాయాన్ని కోల్పోయినందుకు రూ. 25.65 లక్షలు, వైద్య ఖర్చుల కోసం రూ. 3.74 లక్షలు ఇవ్వాలని ఆ తీర్పులో పేర్కొంది.