గ్వాలియర్: ఓ మధ్యతరగతి కుటుంబం నివసించే ఇంటికి ఎంత కరెంట్ బిల్లు వస్తుంది! సాధారణంగా వెయ్యి రూపాయలకు అటూఇటుగా ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ప్రియాంక గుప్తా కుటుంబానికి ఏకంగా రూ.3,419 కోట్ల విద్యుత్తు బిల్లు వచ్చింది.
దీంతో ఆ కుటుంబసభ్యుల గుండెలు గుభేల్మన్నాయి. బిల్లులోని అంకెల సంఖ్య ఇచ్చిన షాక్‌తో ప్రియాంక గుప్తా మామ దవాఖానలో చేరాల్సిన పరిస్థితి నెలకొన్నది. కాగా మానవ తప్పిదం వల్లే ఇలా జరిగిందని, వచ్చింది కేవలం 1300 బిల్లేనని విద్యుత్తు కంపెనీ వివరణ ఇచ్చుకున్నది.