న్యూఢిల్లీ : ఓ పర్యావరణ వేత్త ఎంతో సాహసంతో చేసిన పని (Viral Video) నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సామాజిక కార్యకర్త నాగుపాముకు బాటిల్ నుంచి నీరు పట్టి దాన్ని తేరుకునేలా చేసిన ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. తమిళనాడులోని కడలూరు జిల్లా తిరుచపరూర్లో ఈ ఘటన జరిగింది. తన ఇంటి వద్ద కోబ్రా నిద్రాణంగా పడి ఉండటాన్ని నటరాజన్ గమనించాడు.
ఆపై నటరాజన్ పర్యావరణ కార్యకర్త చెల్లాకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్ధలానికి చేరుకున్న చెల్లా పాము అచేతనంగా పడిఉండటంతో పాటు డీహైడ్రేషన్‌కు గురైందని గుర్తించాడు. దీంతో తన ప్రాణాలను రిస్క్ చేసి మరీ కోబ్రాకు ప్లాస్టిక్ బాటిల్ నుంచి నీరు పట్టడం ప్రారంభించాడు. పాము నీటిని తాగుతుండటంతో బాటిల్ నుంచి నీరు పట్టడం కొనసాగించాడు.
Man gives water to cobra straight from bottle to revive it, video goes viral pic.twitter.com/K0JUateWqp
— $h!v@ (@Shivakumar50) July 5, 2023
పాము మెల్లిగా కోలుకోవడంతో చెల్లా దాన్ని పెద్ద ప్లాస్టిక్ బాటిల్లోకి ఎక్కించి అడవిలో విడిచిపెట్టాడు. విషపూరితమైన ఆహారం తీసుకోవడం వల్లే డీహైడ్రేషన్‌కు గురైన పాము అచేతనంగా పడిఉండవచ్చని నటరాజన్‌తో చెల్లా చెప్పుకొచ్చాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి పామును కాపాడిన చెల్లా సాహసాన్ని సోషల్ మీడియాలో పెద్దసంఖ్యలో యూజర్లు ప్రశంసించారు.
Read More :
Shocking incident | Open the door.. అంటూ టేకాఫ్ అవుతున్న విమానంలో యువకుడి వీరంగం..