లండన్: ఎయిర్పోర్ట్ నుంచి విమానం బయలుదేరింది. అందులో ఉన్న ప్రయాణికులంతా టేక్ ఆఫ్‌కు సిద్ధమవుతున్నారు. విమానం మరికాసేపట్లో గాల్లోకి ఎగురనుందని సిబ్బంది అనౌన్స్ చేశారు. ఇంతలో ఓ యువకుడు తన పక్క సీట్లో ఉన్న ప్యాసింజర్‌తో గొడవపడుతూ లేచి నిలబడ్డాడు. విమానం డోర్ తీయండంటూ (Open the door) గట్టిగా అరుస్తూ డోర్ వైపు వెళ్తున్నాడు. దీంతో ప్రయాణికులంతా షాక్ గురయ్యారు. ఆ యువకుడు డోర్ వైపు అడుగులు వేస్తుండగా మరో ఇద్దరు అతడిని అడ్డుకున్నారు. ఈ విస్తుపోయే ఘటన క్రొయేషియాలోని జాదర్ నుంచి లండన్ వెళ్తున్న ర్యాన్ఎయిర్ (Ryanair) విమానంలో చోటుచేసుకున్నది.
యూకేకు (United Kingdom) చెందిన 27 ఏండ్ల యువకుడు ర్యాన్ఎయిర్ విమానంలో జాదర్ (Zadar) నుంచి లండన్ (London) వెళ్తున్నాడు. విమానం టేక్ఆఫ్ (Take-off) అవడానికి సిద్ధమవుతుండగా.. గట్టిగా కేకలు పెడుతూ అతడు తన సీట్లో నుంచి లేచాడు. విమానం డోరు తీస్తానంటూ అటుగా అడుగులు వేయసాగాడు. ఇంతలో ఓ వ్యక్తి అతడిని అడ్డుకున్నాడు. మరో ప్రయాణికులు అతనికి జతవడంతో ఇద్దరూ కలిసి ఆ యువకుడిని కిందపడేశారు. విమానం సిబ్బంది అతడిని స్థానిక పోలీసులుకు అప్పగించారు. అనంతరం విమానం తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అందులో ఉన్నవారు విస్తుపోయారు. ఈ తతంగాన్నంతా విమానంలో ఉన్న ప్రయాణికులు తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో (Social media) చక్కర్లు కొడుతున్నది.
🇭🇷🇬🇧 A British tourist tried to open the door on a crowded Ryanair plane flying from Zadar in Croatia.
When he ran to the door, two young men jumped on him and threw him to the floor. pic.twitter.com/taUp4nzkpD
— Winnie Pooh (@WinniePooh14466) July 3, 2023