Suicide : మహారాష్ట్ర (Maharastra) లోని ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) లో విషాద ఘటన జరిగింది. తాను, తన స్నేహితుడు బహిరంగ మూత్ర విసర్జన (Public urination) చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. నెటిజన్లు దూషణలు, బెదిరింపులతో వారిని ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో తట్టుకోలేక అతను ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు.
జాల్నాలోని తోక్మాల్ తండాకు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి కలిసి శంభాజీనగర్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో ‘ఛత్రపతి శంభాజీనగర్’ అని రాసి ఉన్న బోర్డు కింద ఇద్దరూ బహిరంగ మూత్ర విసర్జన చేశారు. దీన్ని ఓ వ్యక్తి తన మొబైల్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి అసభ్యకర కామెంట్స్, బెదిరింపులు వచ్చాయి.
దాంతో ఇద్దరూ సోషల్ మీడియాలో బహరింగ క్షమాపణలు చెప్పారు. అయినా నెటిజన్ల నుంచి బెదిరింపులు ఆగకపోవడంతో మనస్తాపానికి గురై తమ తండాలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.