తిరువనంతపురం: ఒక చోట నిల్చొని ఉన్న బాలిక వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. రెండు చేతులతో ఆమెను ఎత్తి నేలపై పడేశాడు. అనంతరం ఏమీ జరుగనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. మంజేశ్వర్ సమీపంలోని ఒక మసీదు వద్ద గురువారం తొమ్మిదేళ్ల ముస్లిం బాలిక నిల్చొని ఉన్నది. లోపల ఉన్న బాబాయ్ కోసం ఆ చిన్నారి ఎదురుచూస్తున్నది. ఇంతలో ఒక వ్యక్తి నడుచుకుంటూ ఆ బాలిక వద్దకు వచ్చాడు. రెండు చేతులతో ఆ చిన్నారిని పట్టుకుని గాల్లోకి ఎత్తి బలంగా నేలపై పడేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాగా, ఈ సంఘటనతో భయపడిన ఆ బాలిక చాలా సేపటి తర్వాత ఈ విషయాన్ని తన పేరెంట్స్‌కు చెప్పింది. దీంతో ఆ మసీదులోని సీసీటీవీ ఫుటేజ్‌ను వారు పరిశీలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు నిందితుడ్ని గుర్తించారు. ఉధ్యవరం ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల అబూబకర్ సిద్ధిక్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
https://twitter.com/IndiaToday/status/1593248589114880008?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1593248589114880008%7Ctwgr%5Eb2d47d8968c1f7b6c7714a10debaa9eb961de1c2%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Findia%2Fstory%2Fkerala-man-arrested-violently-throws-girl-to-ground-video-2298531-2022-11-17