అహ్మదాబాద్: ఫిక్స్డ్ డిపాజిట్‌పై పన్ను విధించి మినహాయించినందుకు బ్యాంక్ మేనేజర్‌పై ఒక వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో బ్యాంక్ మేనేజర్‌ను అతడు కొట్టాడు. (Man Beats Bank Manager) అతడి తల్లితో పాటు అక్కడున్న వారు వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం వస్త్రాపూర్ ప్రాంతంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌కు కస్టమర్ జైమన్ రావల్ వెళ్లాడు. ఫిక్స్డ్ డిపాజిట్‌పై పెరిగిన పన్ను మినహాయింపుపై ఆగ్రహం చెందాడు. దీని గురించి బ్యాంక్ మేనేజర్, అతడి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో వారిద్దరూ ఒకరినొకరు చొక్కా కాలర్ పట్టుకుకున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగి తలపై జైమన్ రావల్ కొట్టాడు.
కాగా, తన కుమారుడ్ని నిలువరించేందుకు అతడి తల్లి ప్రయత్నించింది. అలాగే బ్యాంకులోని మిగతా సిబ్బంది కూడా కస్టమర్ జైమన్ రావల్‌ను ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో మరో బ్యాంకు సిబ్బందితో కూడా అతడు ఘర్షణపడ్డాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
‘Customer’ turned ‘Crocodile’ after TDS Deduction in Bank FD. FM sud instruct Bank staffs to learn ‘taekwondo’ for self defense. pic.twitter.com/CEDarfxcqi
— Newton Bank Kumar (@idesibanda) December 6, 2024