న్యూఢిల్లీ: ఒక వ్యక్తి డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. డబ్బుల కోసం తల్లితో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన ఆమెను హత్య చేశాడు. (drug addict son kills mother) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. దయాల్పూర్ ప్రాంతంలో నివసించే 40 ఏళ్ల సోను కొంతకాలం డ్రైవర్‌గా పని చేశాడు. డ్రగ్స్‌కు బానిస అయిన అతడు ప్రస్తుతం ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నాడు. అయితే డ్రగ్స్ కొనేందుకు డబ్బుల కోసం 60 ఏళ్ల తల్లిని రోజూ వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న రాత్రి వేళ తల్లితో సోను తీవ్ర వాగ్వాదానికి దిగాడు. తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిరాకరించిన తల్లిని హత్య చేశాడు.
కాగా, ఈ సమాచారం తెలిసిన పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. తల్లిని హత్య చేసిన సోనూను అరెస్ట్ చేశారు. అతడి తల్లి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రగ్స్‌కు బానిస అయిన సోను డబ్బుల కోసం తల్లితో తరుచుగా గొడవపడేవాడని పోలీస్ అధికారి తెలిపారు. శుక్రవారం రాత్రి వారి మధ్య వాగ్వాదం జరుగడంతో తల్లిని అతడు హత్య చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.