కోల్కతా, జనవరి 2: బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించడానికి బీఎస్ఎఫ్ సాయం చేస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా రాష్ర్టాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతున్నదని ఆమె వెల్లడించారు.
ఈ విషయంలో బీఎస్ఎఫ్కు కేంద్రం మద్దతు ఇస్తున్నదని అన్నారు. ‘ఇస్లాంపూర్, సితాయ్, చోప్రా తదితర సరిహద్దు ప్రాంతాల్లో చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించేందుకు బీఎస్ఎఫ్ అనుమతిస్తున్నది’ అని ఆమె సమీక్ష సమావేశంలో ఆరోపించారు.