కోల్కతా : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీ బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఆ పార్టీ పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు.
ఆ ఘటనలపై ఎన్ఏఐ దర్యాప్తునకు ఆదేశించి ఆ నేరాన్ని స్థానికులపై వేసేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆమె తెలిపారు. దిన్హాటాలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.