INDIA Bloc | విపక్ష కూటమి ప్రధాని అభ్యర్ధిగా మల్లికార్జున్ ఖర్గే..? : కాంగ్రెస్ చీఫ్ పేరును ప్రతిపాదించిన దీదీ
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) అనుసరించాల్సిన వ్యూహాలు, భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు వంటి అంశాలపై కసరత్తు సాగుతోంది. ఇవే ప్రధాన అజెండాగా ఢిల్లీలో మంగళవారం విపక్ష కూటమి కీలక భేటీ కొనసాగుతోంది.
న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) అనుసరించాల్సిన వ్యూహాలు, భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు వంటి అంశాలపై కసరత్తు సాగుతోంది. ఇవే ప్రధాన అజెండాగా ఢిల్లీలో మంగళవారం విపక్ష కూటమి కీలక భేటీ కొనసాగుతోంది. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా మల్లికార్జున్ ఖర్గే పేరును ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించినట్టు సమాచారం.
కాగా పీఎం రేసులో తన పేరును తెరపైకి తీసుకురావడం పట్ల ఖర్గే విముఖత వ్యక్తం చేస్తూ సున్నితంగా తిరస్కరించారని విపక్ష కూటమి వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిపై ఎలాంటి నిర్ణయం తీసుకోదని, ఎన్నికల అనంతరమే ప్రధాని ఎవరనేది ఖరారు చేస్తారని మమతా బెనర్జీ సోమవారం వెల్లడించగా మరుసటి రోజే ఈ విషయంలో ఆమె యూటర్న్ తీసుకున్నారు.
విపక్ష ఇండియా కూటమి అభ్యర్ధిగా ఖర్గే పేరును ఆమె ఇవాల్టి భేటీలో ప్రతిపాదించారని తెలిసింది. ఇక ఇటీవల ముగిసిన కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపధ్యంలో ఓటమి నైరాశ్యం ప్రభావం విపక్ష కూటమిపై పడకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపైనా ఈ భేటీలో విపక్ష నేతలు చర్చిస్తున్నట్టు తెలిసింది.
Read More :
Osmania University | రేపటి నుంచి ఓయూలో అంతర్జాతీయ సదస్సు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

