న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని మమతాబెనర్జీ సర్కారు ఆ రాష్ట్ర గవర్నర్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శాసనసభ ఆమోదించిన ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలుపకుండా గవర్నర్ తొక్కిపెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది.
గవర్నర్ తీరు రాజ్యాంగంలోని అధికరణ 200ను ఉల్లంఘించడమేనని ఆరోపించింది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ బిల్లులను శాసన సభ ఆమోదించిందని, వాటికి గవర్నర్ ఆమోదం తెలుపకపోవడం వల్ల ప్రజలపై ప్రభావం పడుతున్నదని వివరించింది.