రాష్ట్రపతి ఎన్నికలు : శరద్ పవార్‌తో మమతా బెనర్జీ భేటీ
రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం సమావేశమయ్యారు. బీజేపీయేతర పక్షాలతో సమావేశమయ్యేందుకు ఢిల్లీ చేరుకున్న దీదీ శరద్ పవార్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు.
ఇక రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు బుధవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో మమతా బెనర్జీ విపక్షాలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని కోరుతూ మమతా బెనర్జీ 22 మంది విపక్ష నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలను కూడా ఈ భేటీకి దీదీ ఆహ్వానించారు.
విభజన శక్తులను దీటుగా ఎదుర్కొనే క్రమంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకునేందుకు రాష్ట్రపతి ఎన్నికల సరైన వేదిక అవుతుందని విపక్ష నేతలకు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. ఇక రేపు జరిగే విపక్షాల భేటీకి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లు హాజరు కానున్నారు. మరోవైపు విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా తాను బరిలో ఉండబోనని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పార్టీ నేతలతో స్పష్టం చేశారని సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

