కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ ససేమిరా అంటున్నారు. ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని, ఈసీ వారికి సహకరించిందని ఆరోపిస్తూ ఆమె నిరసన గళం విప్పారు. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించినా, తాను వెనక్కి తగ్గేది లేదని, తనను డిస్మిస్ చేయాలని సవాల్ విసిరారు. తన నివాసంలో పార్టీ అగ్రనేతలు, నూతన ఎమ్మెల్యేలతో బుధవారం జరిగిన సమావేశంలో మమత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కావాలంటే రాష్ట్రపతి పాలన పెట్టుకోనీయండి, నన్ను డిస్మిస్ చేయనీయండి. కానీ ఇదొక చీకటి రోజుగా రికార్డుల్లో మిగిలిపోతుంది’ అని ఆమె స్పష్టంచేశారు.