INDIA Bloc Leadership | ప్రతిపక్ష ఇండియా కూటమిలో నాయకత్వ (INDIA Bloc Leadership) పోరు ముదురుతున్నది. ఇటీవలే జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణ ఓటమితో కాంగ్రెస్, రాహుల్‌గాంధీ నాయకత్వ పటిమపై కూటమి భాగస్వామ్య పార్టీల్లో నమ్మకం సడలింది. రాహుల్ నాయకత్వంలో బీజేపీని ఎదుర్కోవడం కష్టమేనని, కాంగ్రెస్‌ను నమ్ముకుంటే తామూ మునగడం ఖాయమని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) నాయకత్వానికి జై కొడుతున్నారు. ఇప్పటికే సమాజ్‌వాదీ, ఎన్సీపీ (శరద్చంద్ర పవార్), శివసేన (యూబీటీ) దీదీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో శివసేన (యూబీటీ) (Shiv Sena-UBT) అధికార ప్రతినిధి ఆనంద్ దుబే (Anand Dubey) కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ సమర్థ నాయకురాలే అని.. అయితే, కూటమికి నాయకత్వం వహించేందుకు తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) అత్యంత సరైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ‘మమతా బెనర్జీ బలమైన నాయకురాలు. 2016, 2021లో బెంగాల్లో ప్రధాని మోదీ రాజకీయ ఉప్పెనను రెండుసార్లూ సమర్థవంతంగా అడ్డుకున్నారు. అయితే, కూటమిని ఏకం చేయడానికి, ముందుకు నడిపించడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉద్ధవ్ ఠాక్రేకు ఉన్నాయి. దేశాన్ని ఆయన అభివృద్ధివైపు నడిపించగలడు. ఇండియా కూటమిని అందరికంటే మెరుగ్గా నడిపించగలడు’ అని దుబే వ్యాఖ్యానించారు.
Mumbai, Maharashtra: Shiv Sena (UBT) spokesperson Anand Dubey says, “Mamata Banerjee is a prominent leader in the country and has been the Chief Minister of West Bengal since 2011. She has successfully stopped Modi’s path in Bengal, defeating him not once, but twice. She won the… pic.twitter.com/CdZyfyqtkC
— IANS (@ians_india) December 11, 2024
Mumbai, Maharashtra: Shiv Sena (UBT) spokesperson Anand Dubey says, “Mamata Didiji is a capable leader, there is no doubt about that. She was elected in 2011, again in 2016, and in 2021, and she consistently stops the BJP in West Bengal. She is capable, but Mamata Didiji is not… pic.twitter.com/ja7tGpmW7a
— IANS (@ians_india) December 11, 2024
Also Read..
Rahul Gandhi | వినూత్న నిరసన.. రాజ్‌నాథ్ సింగ్‌కు గులాబీ, జాతీయ జెండా ఇచ్చిన రాహుల్ గాంధీ
Ashwini Vaishnaw: కావాలంటే ఏఐపై చట్టం చేస్తాం: అశ్వినీ వైష్ణవ్