Rahul Gandhi | అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్‌కు సంబంధాలు, అదానీ అవినీతి అంశాలు పార్లమెంట్‌ను కుదిపేస్తున్నాయి. సోరోస్ అంశంపై కాంగ్రెస్‌ను అధికార పార్టీ ఎంపీలు ప్రశ్నిస్తుండగా.. అదానీ వ్యవహారంపై బీజేపీని విపక్ష కూటమి ఎంపీలు నిలదీస్తున్నారు. దీంతో సమావేశాలు అట్టుడుకుతున్నాయి.
#WATCH | Delhi | In a unique protest in Parliament premises, Congress MPs are giving a Rose flower and Tiranga to NDA MPs pic.twitter.com/rYiNdewQ4w
— ANI (@ANI) December 11, 2024
అదానీ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో గులాబీలు (Rose flower), జాతీయ జెండాలను (Tiranga) అందించారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా ఇండియా కూటమి ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో నిల్చొని.. సమావేశాలకు హాజరైన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులకు వీటిని అందించారు. అదే సమయంలో వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh)కు కూడా రాహుల్ గులాబీని, జాతీయజెండాను ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
#WATCH | Delhi | In a unique protest in Parliament premises, Congress MP and LoP Lok Sabha, Rahul Gandhi gives a Rose flower and Tiranga to Defence Minister Rajnath Singh pic.twitter.com/9GlGIvh3Yz
— ANI (@ANI) December 11, 2024
Also Read..
Ashwini Vaishnaw: కావాలంటే ఏఐపై చట్టం చేస్తాం: అశ్వినీ వైష్ణవ్