Kazipet Railway Station: అమృత్ భారత్ స్కీమ్ కింద కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి: అశ్వినీ వైష్ణవ్
Kazipet Railway Station: తెలంగాణ రైల్వే స్టేషన్లలో పెట్టుబడి పెంచినట్లు మంత్రి వైష్ణవ్ తెలిపారు. కాజీపేట స్టేషన్ను అమృత్ భారత్ స్కీమ్ కింద డెవలప్ చేస్తున్నామన్నారు. తెలంగాణలో రైల్వే పనుల కోసం నిధులను పెంచినట్లు మంత్రి లోక్సభలో చెప్పారు.
న్యూఢిల్లీ: కాజీపేట రైల్వే స్టేషన్(Kazipet Railway Station)ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో ఇవాళ ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్నారు. దాంట్లో కాజీపేట రైల్వే స్టేషన్ కూడా ఉన్నట్లు చెప్పారు.
తెలంగాణకు రైల్వే నిధుల కేటాయింపు పెంచినట్లు మంత్రి చెప్పారు. ఆ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో 5336 కోట్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. యూపీఏ పాలన సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఆ స్థాయిలో నిధులు రాలేదన్నారు. గతంలో తెలంగాణ, ఆంధ్రకు కలిపి కేవలం 866 కోట్లు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. కేవలం నిధుల కోసమే విభజన సృష్టించడం సరికాదు అని మంత్రి తెలిపారు.
కాజీపేట రైల్వే స్టేషన్ను డివిజన్గా డెవలప్ చేస్తున్నారా అని వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రశ్న వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే రీడెవలప్మెంట్ ప్రాజెక్టును మోదీ సర్కారు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1300 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, చెన్నైలోని ఎగ్మోర్ రైల్వే స్టేషన్ను కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

