Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని దిఘా (Digha)లో పూరీ తరహా జగన్నాథుడి ఆలయాన్ని (Puri like Jagannath Temple) నిర్మించిన విషయం తెలిసిందే. పవిత్ర అక్షయ తృతీయ సందర్భంగా ఆ ఆలయాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
20 ఎకరాల్లో ఈ ఆలయం విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టును రూ.250 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ ఆలయ నిర్మాణంలో రాజస్థాన్‌కు చెందిన 800 మందికిపైగా నైపుణ్యం కలిగిన కళాకారులు పాలు పంచుకున్నారు. సాంప్రదాయ కళింగ నిర్మాణ శైలిలో రాజస్థాన్ నుంచి సేకరించిన సున్నితమైన గులాబీ ఇసుకరాయితో ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయంతో దిఘా ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read..
National Security Advisory Board | జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా అలోక్ జోషి
Manish Sisodia | రూ. 2,000 కోట్ల స్కామ్.. ఆప్ నేతలపై ఏసీబీ కేసు
Pahalgam attack | పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కమాండర్ కీలక పాత్ర.. గుర్తించిన ఎన్ఐఏ