Manish Sisodia | ఢిల్లీ మాజీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా (Manish Sisodia), సత్యేంద్ర జైన్ (Satyendar Jain)లపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఆప్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో 12,000 తరగతి గదులు, పాఠశాల భవనాల నిర్మాణంలో రూ. 2 వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు (classroom construction scam) బయటపడింది. ఇందులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి జైన్లు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు సిసోడియా, జైన్లపై కేసులు బుక్ చేశారు. అంతేకాదు ఈ స్కామ్లో ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ చీఫ్ మధుర్ వర్మ తెలిపారు.
గత ఆప్ ప్రభుత్వంలో సిసోడియా విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. సత్యేంద్ర జైన్ ప్రజా పనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఢిల్లీలో 12,000 తరగతి గదులు, పాఠశాల భవనాలను నిర్మించారు. అయితే, వాటిని అధిక వ్యయంతో నిర్మించినట్లు గుర్తించారు. వీటి నిర్మాణంలో రూ.2 వేల కోట్లు అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది. ఈ పనులను 34 మంది కాంట్రాక్టర్లకు అప్పగించారని.. అందులో ఎక్కువ మంది ఆప్తో సంబంధాలు కలిగిన కాంట్రాక్టర్లే ఉన్నట్లు తేలింది. నిర్ణీత గడువులోపు నిర్మాణం పూర్తి కాలేదని.. దీని కారణంగా ఖర్చు భారీగా పెరిగిందని ఏసీబీ తెలిపింది.
Also Read..
Pahalgam attack | పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కమాండర్ కీలక పాత్ర.. గుర్తించిన ఎన్ఐఏ
ICSE Results | ఐసీఎస్ఈ పది, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలు విడుదల
Mother Dairy | పాల ధరలను పెంచిన మదర్ డెయిరీ.. లీటరుపై ఎంతంటే..?