కోల్కతా, ఏప్రిల్ 30 : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సీఎం మమతా బెనర్జీ తోసిపుచ్చారు. 2021 ఎన్నికల్లోనూ ఇదేవిధంగా బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పాయని, కానీ ఫలితాలు మరో విధంగా వచ్చాయని అన్నారు.
తృణమూల్ 226 స్థా నాలను మించి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి మమతా బెనర్జీ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 4వ తేదీన కౌంటింగ్ కేంద్రాల వద్ద కార్యకర్తలు కాపలాగా ఉండాలని పిలుపునిచ్చారు.