Modi 3.0 : ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాలు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా, ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు.
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆయనకు ఆహ్వాన పత్రం అందిందని సమాచారం. విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో చర్చించిన మీదట ఖర్గే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు మోదీ క్యాబినెట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లకు చోటు దక్కనుంది.
Read More :
Prime Minister Modi | మోదీ ప్రమాణ స్వీకారానికి సూపర్ స్టార్ రజనీకాంత్