Super star Rajinikanth | భారత ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేస్తారు. ఈ నేపథ్యంలోనే మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు పలువురు అధ్యక్షులతో పాటు ప్రతిపక్ష నాయకులు హాజరవుతున్నారు. తాజాగా తమిళ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మోదీ స్వీకారోత్సవం కోసం ఢిల్లీ వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది చాలా పెద్ద విజయం. ఆయనకు నా శుభాకాంక్షలు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బలమైన ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకున్నారు. ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి దారి తీస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి నాకు ఆహ్వానం అందింది. దాని గురించి త్వరలో అప్డేట్ ఇస్తా అంటూ వెల్లడించాడు.
Chennai, Tamil Nadu: Actor Rajinikanth leaves for Delhi to attend the swearing-in ceremony of PM-designate Narendra Modi.
He says, “Narendra Modi will be sworn in as PM consecutively for the third time. This is a very big achievement. My wishes to him. People have also elected a… pic.twitter.com/ENxlk3I440
— ANI (@ANI) June 9, 2024